Site icon NTV Telugu

తెలంగాణ లాక్ డౌన్: వీటికి మాత్రమే అనుమతి..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు.   ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు, మెడిసిన్ ఇతర వ‌స్తువులు కొనుగోలు చేయ‌డానికి అనుమ‌తులు ఇచ్చారు.  ఉద‌యం 10 గంట‌ల త‌రువాత ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దు.  లాక్‌డౌన్ మిన‌హాయింపులు ఉన్న అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, లాక్ డౌన్ పాసులు ఉన్న వారికి మాత్ర‌మే అనుమ‌తులు ఉంటాయి.  ఇక, వేటికి పూర్తి స్థాయిలో మిన‌హాయింపులు ఉన్నాయి, ఎవ‌రికి అనుమ‌తులు ఇస్తారు అనే విష‌యాలకు సంబందించి కాసేస‌ట్లో మార్గ‌దర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా రిలీజ్ చేయ‌నున్నారు.  

Exit mobile version