తెలంగాణలో లాక్‌డౌన్‌ను పోడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతున్నది. ఈ భేటీలో లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పించగా, రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తో పాటుగా కరోనా చికిత్స, బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో బెడ్ల గురించి, వ్యాక్సినేషన్ గురించి ఈ భేటీలో చర్చించారు.
తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు… ఎన్నిరోజులంటే…
