
ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలు జరుగుతుండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు ప్రయాణానికి అనుమతి ఉన్నది. ఉదయం 10 గంటల తర్వాత ఎవరిని బయటకు అనుమతించడం లేదు. బస్టాండ్లు బోసిపోయి దర్శనం ఇస్తున్నాయి. చాలా మందికి లాక్‌డౌన్‌కు సంబందించి నిబందనలు తెలియకపోడటంతో బస్టాండ్ వద్దకు చేరుకున్న ప్రయాణికులు బస్సలు లేకపోడంతో ఇబ్బందును పడుతున్నారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి ఒడిశా, మహారాష్ట్ర లకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.