Site icon NTV Telugu

Local body Elections : ముగిసిన మూడో విడత ప్రచార పర్వం

Local Body Elections

Local Body Elections

Local body Elections : రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ విడత పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న (బుధవారం) 182 మండలాలు, 4157 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనుంది. తుది విడతలో 53 లక్షల 6 వేల 401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 26 లక్షల 1861 మంది పురుష ఓటర్లు, 27 లక్షల 4 వేల 394 మంది మహిళా ఓటర్లు, 146 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 వేల 483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. మూడో విడతలో మొత్తం 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

Studds Jet Toxic: స్టడ్స్ జెట్ టాక్సిక్ హెల్మెట్‌ విడుదల.. రక్షణ కోసం ABS షెల్.. ధర తక్కువే

పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి (బుధవారం) సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాలు సాధిస్తుండగా.. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. అంతేకాకుండా.. కొన్ని కొన్ని చోట్ల ఓట్లు సమంగా రావడంతో అభ్యర్థులు చివరకు టాస్ తో విజయం సాధిస్తున్నారు.

IPL 2026 Auction: ఐపీఎల్‌ వేలంలో 39 ఏళ్ల స్పిన్నర్.. పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు!

Exit mobile version