Site icon NTV Telugu

Local Body Elections : ఎన్నికల అలర్ట్..! కీలక తేదీలు ఇవే..!

Local Body Elections

Local Body Elections

Local Body Elections : తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 564 మండలాలకు చెందిన 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు దఫాల్లో ఓటింగ్ జరుగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని ప్రకటించారు.

మొదటి దఫా – డిసెంబర్ 11 పోలింగ్

రెండో దఫా – డిసెంబర్ 14 పోలింగ్

మూడో దఫా – డిసెంబర్ 17 పోలింగ్

ప్రతి దఫా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలనుంచి ఓట్ల లెక్కింపు మొదలై, అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులే అదే రోజు ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు.

Exit mobile version