NTV Telugu Site icon

Loan app fraud: లోన్‌ యాప్‌ పేరిట మోసం.. సిద్దిపేట, కరీంనగర్‌లో బాధితులు

Lone Aap Froud

Lone Aap Froud

Loan app fraud: లోన్‌ యాప్‌ పేరిటి మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలో వెలుగు చూస్తున్న మోసాలు ఇప్పుడు జిల్లాలకు పాకింది. లోన్‌ మంజూరు అయ్యిందంటూ ఫోన్‌ చేయడం వారి ఖాతాలో వున్న డబ్బులను ఖాలీ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అయితే.. చేసే మోసం ఒక‌టే కాని మార్గం వేరుంటుంది. తెలివైన వాళ్లు కూడా అప్పుడప్పుడూ ఇలాంటి కొత్త మోసాల‌కు, కొత్త అవ‌తారం ఎత్తుతున్న మోస‌గాళ్లకు చిక్కి స‌ర్వం కోల్పోతుంటారు. తాజాగా ఇలాంటి మోసాలు జిల్లాలో చెలరేగుతున్నాయి. లోన్‌ యాప్‌ ఇస్తామంటూ మీ లోన్‌ ఒకే అయ్యింది అంటూ కాల్‌ చేసి బ్యాంక్‌ లో వున్న డబ్బులు సైతం ఖాలీ చేస్తున్నారు కేటు గాల్లు. దీంతో లబోదిబో మంటున్నారు బాధితులు. ఇలాంటి ఘటనే సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లో చోటుచేసుకుంది.

Read also: Sripada Phani Sastry: జెనీవా అసెంబ్లీకి పోటీలో శ్రీపాద ఫణిశాస్త్రి

సిద్దిపేట జిల్లాలో సైబర్ నేరాలు ఆగడంలేదు. లోన్ కి ఆశపడి లక్షా 7 వేల రూపాయలు పొగుట్టుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి లోన్ మంజూరైందని వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది. ప్రాసెస్‌సింగ్‌ ఫీజు ఉందని అతనికి బురిడీ కొట్టించాడు. అది నమ్మిన బాధితుడు సరే అంటూ పలు దఫాలుగా ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా లక్ష ఏడువేల రూపాయాలు చెల్లించాడు. లోన్‌ ఎంత వచ్చింది ఎప్పడు తన ఖాతాలో పడుతుందనే విషయంపై బాధితుడు ఆనెంబర్‌ కు తిరిగి కాల్‌ చేశాడు అంతే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌. పలుసార్లు కాల్ చేసిన కాల్ కలవలేదు. ఫోన్ స్విచ్‌ఆఫ్‌ రావడంతో మోసపోయానని భావించిన బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు లోన్‌ కు ఆశపడి పోగొట్టుకున్నానని వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Sripada Phani Sastry: జెనీవా అసెంబ్లీకి పోటీలో శ్రీపాద ఫణిశాస్త్రి

ఇలాంటి ఘరానా మోసమే కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తికి బజాజ్ ఫైనాన్స్ లో రెండు లక్షల లోన్ మంజూరు అయిందంటూ గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీల కింద అమౌంట్ పంపాలని సైబర్ కేటుగాళ్లు సూచించారు. దీంతో విడతల వారీగా కలిపి ఫోన్ పే అకౌంట్ ద్వారా 85,033 వేయిలు చెల్లించిన బాధితుడు సతీష్. తిరిగి ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆందోళనకు గురైన సతీష్. మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించాడు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఇలా ఒక్కసారి కాదు చాలా సైబర్‌ ఫాడ్స్‌ చాలా జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాని కోరారు. ఇలాంటి కాల్స్‌ వస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
Airtel Rs.799Plan : ఎయిర్ టెల్ సరికొత్త రీచార్జ్ ప్లాన్.. ప్లాన్ ఒక్కటి కనెక్షన్లు రెండు

Show comments