Telangana: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు నల్ల టీ షర్టులు ధరించి మెట్రో రైల్‌పై ప్రయాణించాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మియాపూర్ మెట్రో స్టేషన్ కు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొనేందుకు చంద్రబాబు మద్దతుదారులు వచ్చారు. దీంతో పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్‌ను మూసివేయాలని పోలీసులు అధికారులకు సూచించారు. దాంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు సాంకేతిక సమస్య అని చెప్పి మియాపూర్ మెట్రో స్టేషన్ ను కాసేపు మూసివేశారు. మెట్రో స్టేషన్‌ను మూసివేయడంతో ఆగ్రహించిన చంద్రబాబు మద్దతుదారులు మెట్రో స్టేషన్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. మంచికే కష్టాలు ఎక్కువ.. తనకే కష్టాలు తెచ్చిపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.
శాంతియుత వాతావరణంలో నిరసనలు చేద్దామనుకుంటే.. మెట్రో అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నిరసన కారులను లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో.. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో వరకు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య నల్ల టీ షర్టులు ధరించి ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు. మద్దతుదారులు ఒక్కసారిగా నల్ల టీషర్టులు ధరించి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులను అడ్డుకున్న మెట్రో అధికారులు కొద్దిసేపు ప్రయాణికులను మెట్రో స్టేషన్‌లోకి అనుమతించినట్లు తెలుస్తోంది.
WhatsApp: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్స్.. బెనిఫిట్స్ మాములుగా లేవుగా..