Dil Raju: దిల్ రాజు అల్లుడు కారు చోరీ.. దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అల్లుడు కారు చోరీకి గురైంది. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి రూ. కోటిన్నర విలువైన పోర్షే కారు చోరీకి గురైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గంట వ్యవధిలో కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.
దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం రూ.1.7 కోట్ల విలువైన తన పోర్షే కారులో జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లారు. హోటల్ ముందు కారు ఆపి లోపలికి వెళ్లారు. 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసరికి కారు బయట కనిపించలేదు. దీంతో అర్చిత్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారును ఆపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. తాను ప్రముఖ వ్యాపారవేత్త ఆకాష్ అంబానీ పి.ఎ అంటూ పోలీసులకు దబాయించాడు. హృతిక్ రోహన్ నా పీఏ అంటూ రుబాబుగా మాట్లాడాడు. ఒక్క మంత్రి పిక్ అప్ కొరకు కారు తీసుకొని పోతునాన్ని పోలీసులకే దబాయించి మట్లాడాడు. అతని వదిలేస్తే అంబానీ దగ్గరకు వెళ్తానని పోలీసులను బెదిరించాడు. అతని మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నారు. కారును దొంగిలించిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్‌లో చికిత్స అందించారని తేలింది. నిందితుడిని హైదరాబాద్ మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు. అనంతరం అర్చిత్ రెడ్డికి కారు అప్పగించారు.
Builder Murder: పాము కాటుతో భర్త హత్య.. చేయించింది కట్టుకున్న భార్యే
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
తాజావార్తలు
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!