NTV Telugu Site icon

Leopard in Jeedimetla: జీడిమెట్లలో చిరుత ఆనవాల్లు.. భయాందోళనలో కాలనీ వాసులు

Cheetah In Jeedimetla

Cheetah In Jeedimetla

Leopard in Jeedimetla: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అపురూప కాలనీలో చిరుత సంచరిస్తున్న వీడియో క్లిప్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కాలనీలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలను రికార్డు అయ్యాయి. చిరుత సంచరిస్తోందంటూ వీడియో బయటకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మున్నా బోరంపేట, అపురూప కాలనీలో ఈరోజు చిరుత జాడలు చూసి హడలెత్తిపోయారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతూ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రిపూట బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. చిరుత సంచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు కాలనీని సందర్శించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇది చిరుతపులి కాదని, అడవి కుక్క ఆనవాలుగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఈ వీడియోను ఎవరు పోస్ట్‌ చేశారని ఆరాతీస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు భయభ్రాంతులు చేసే వీడియోలు పోస్ట్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చిరుత ఆనవాళ్లు కాదని, అడవి కుక్క ఆనవాల్లుగా ఉన్నాయని ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయవద్దని, ఒకవేళ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాజాగా సూర్యాపేట జిల్లాలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. పట్టణంలోని డిమార్ట్‌ వెనుక నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఎలుగుబంటి లాక్కెళ్లింది. అర్ధరాత్రి కుక్కల అరుపులతో కాలనీ వాసులు భవనంలోకి వెళ్లి చూడగా ఓ మూలన ఎలుగుబంటి కనిపించింది. దీంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఓ చిరుత అక్కడి నుంచి మరో ఇంట్లోకి చొరబడి రాత్రంతా అక్కడే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
DOST Admission: నేటి నుంచే దోస్త్‌ అడ్మిషన్లు షురూ.. ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి