NTV Telugu Site icon

Gutta Sukhendarreddy: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే మునుగోడు ఉప ఎన్నిక

Gutta Sukhendar Reddy

Gutta Sukhendar Reddy

మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజలు కోరుకుంటే రాలేదు..! అక్కడి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్ల మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో గెలుస్తామని, 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని జాతీయ పార్టీలు కలలు కంటున్నాయని ఎద్దేవ చేశారు. అది జరగదని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడేళ్లలోనే మూడు ఉపఎన్నికలు వచ్చాయన్నారు. హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లలో ఉపఎన్నికలు తప్పని పరిస్థితుల్లో వచ్చినా మునుగోడు ఉప ఎన్నిక బలవంతంగా తెచ్చిన ఎన్నిక అని తెలిపారు.

మునుగోడులో అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ కలలు కంటున్నాయన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ళ బీజేపీ పాలనలో విపరీతమైన ధరల పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పురోగతి జరిగిందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ డైరెక్షన్ లో జాతీయ పార్టీలు నడుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన తెలంగాణకు శ్రీరామ రక్షఅని పేర్కొన్నారు. ఆగస్టు 20న జరిగే ప్రజా దీవెన సభను నల్గొండ జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
Pakistan: పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. కిడ్నాప్‌ చేసి మరీ నీచంగా..!