House Lifting: పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది ఈ సామెతను వినే ఉంటాము. ఓ ఇంటి యజమాని ఇలాంటి పనే చేశాడు. తను 20 ఏళ్ల కిందటే కట్టుకున్న ఇంట్లో వర్షపు నీరు వస్తున్నాయని యూట్యూబ్ లో చూసి తను కూడా అలా చేద్దామని అనుకున్నాడు. చివరకు ఇళ్లే లేకుండా చేసుకున్నాడు. పక్కింటి వారు చేసారనో లేక ఎదుటివారిని చూసి అవి మనం కూడా చేద్దామని అనుకోవడం అవివేకం. మన ఆలోచన పరంగా ముందుకు వెళ్లాలి అంతేకానీ ఎదుటివారిని చూసి గుడ్డిగా నమ్మితే ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలకు బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి ఘటన హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో జరిగిన ఘటనే నిదర్శణం.
Read also: Gidugu Rudraraju: వర్మని బట్టలూడదీసి కొడతాం.. ఏపీసీసీసీ చీఫ్ వార్నింగ్
చింతల్ లోని శ్రీనివాసనగర్ కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 ఏళ్ల కిందటే ఇల్లు కట్టుకున్నాడు. అప్పటికి రోడ్డుకు సమాంతరంగా ఉంది. కానీ, కాలక్రమేణా ఇంటి ముందు రోడ్డు ఎత్తు పెరగడంతో వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లోనే వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో వరదనీటి నుంచి బయటపడాలని భావించిన నాగేశ్వరరావు చర్యలు చేపట్టారు. తన ఇంటి ఎత్తు పెంచాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో జాకీల సాయంతో ఇంటిని పైకి లేపుతున్న వీడియో యూట్యూబ్‌లో చూశాడు. వెంటనే ఇంటిని కూడా చేపట్టాలన్నారు. ఈ పనులను విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ నెమ్మదిగా హైడ్రాలిక్ జాకీలతో ఇంటిని పైకి లేపడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో జాకీలు పట్టు కోల్పోవడంతో అతడి ఇంటి పక్కనే ఉన్న భవనం కూలిపోయింది. జీ ప్లస్ 2 విధానంలో నిర్మించిన భవనం మొత్తం పక్క భవనంపైనే వాలిపోవడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. ఇంటి ఎత్తు పెంచే క్రమంలో జాకీలు పక్కకు వెళ్లడంతో ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. అయితే తమ వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మరమ్మతు పనులు చేపట్టడంతో నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు నాగేశ్వరరావు ఇంటిని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఆదివారం సాయంత్రానికి ఇల్లు కూల్చివేసే అవకాశం ఉంది. అయితే సదరు కాంట్రాక్టర్ మరోసారి అవకాశం ఇస్తే భవనాన్ని సరిచేస్తామని చెప్పడం కొసమెరుపు.
Kajal Agarwal : ట్రెడిషనల్ లుక్ లో కవ్విస్తున్న కాజల్.