తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. అయితే, ఇవాళ వరుణుడు కాస్త తెరపి ఇచ్చారు.. కానీ, ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు ఇలా ఉన్నాయి.. నిన్నటి తీవ్ర అల్పపీడనం బలహీనపడి ఈ రోజు ఉదయం అల్పపీడనంగా మారింది.. ప్రస్తుతం ఉత్తర ఒడిశా తీరం మరియు పరిసర ప్రాంతంలో కొనసాగుతోంది.. దానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగిఉంది.. ఇక, నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 19°N వెంబడి సగటు సముద్రం మట్టంకి 3.1 కి.మీ నుండి 7.6 కి మీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఉంది.. మరోవైపు.. ఈ రోజు రుతుపవన ద్రోణి జైసాల్మర్, కోట, గుణ ,సాగర్, జబల్పూర్ ,పెండ్రా రోడ్, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది..
Read Also: Godavari Floods: వరద కష్టాలు.. పడవలో వరుడి ఇంటికి పెళ్లికూతురు..
అయితే, వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉండగా.. రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.. ఇదే సమయంలో.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. రేపు భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉంటుందని.. ఈ రోజు తెలంగాణలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. వాటి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.