NTV Telugu Site icon

Kuruva Vijay Kumar: రేవంత్‌ రెడ్డి పై డీజీపీ అంజనీకుమార్‌ కు కురువ విజయ్ ఫిర్యాదు

Kuruva Vijay Kumar

Kuruva Vijay Kumar

Kuruva Vijay Kumar: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర డీజీపీ అంజనికుమార్ కు టీపీసీసీ ప్రచారకమిటి సభ్యుడు కురువ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. డీజేపీ దీనిపై సానుకూలంగా స్పందించారు. తక్షణమే ఎంక్వేరి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా.. కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ..
గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం 15ఏళ్లుగా హహర్నిశలు పనిచేశానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు, భూములు తీసుకొని టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకోలేదంటే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీ కి పిర్యాదు చేశామని అన్నారు.

రేవంత్ రెడ్డి అనుచరులు మమ్మల్ని బౌతికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15సంవస్తారాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ..తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వాళ్లకు డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన మమ్మల్ని అనగదొక్కడనికి రేవంత్ కుట్రలు చేస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి తమను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రాణారక్షణ కల్పించాలని డిజిపికి పిర్యాదు చేశామని అన్నారు. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తూ….రేవంత్ అనుచరులతో చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. మా కుటుంబాలకు, మా అనుచరులకు ఏమి జరిగిన పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే అని తెలిపారు.
Sushil Kumar Shinde: రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సుశీల్ కుమార్ షిండే