NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao: ఆ ట్రాప్‌లో పడొద్దని.. కేసీఆర్‌కి కూనంనేని సూచన

Kunamneni Fires On Bjp

Kunamneni Fires On Bjp

Kunamneni Sambasiva Rao Suggestion To CM KCR: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తాజాగా మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీ ఒక్కసారైనా ప్రజాసమస్యలపై పోరాడిందా? అని నిలదీశారు. రాష్ట్రంలో కృత్రిమ రాజకీయ వేడి సృష్టిస్తున్నారని, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. మతోన్మాద ప్రేళాపణతో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దాని ట్రాప్‌లో పడి.. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలు గాలికి వదిలేయకూడదని సూచించారు. సర్పంచ్‌లు నిధులు దారి మళ్లించడాన్ని తాము సమర్థించమని తేల్చి చెప్పారు. ఈ అంశంపై తాము రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Bandi Sanjay: తుగ్లక్ నిబంధనలతో.. పోలీసు అభ్యర్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతోంది

అంతకుముందు కూడా.. బీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని కూనంనేని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరాల పేర్లు మారుస్తోందే తప్ప.. అంతకుమించి బీజేపీ చేసిందేని లేదని ఎద్దేవా చేశారు. అమిత్ షా పేరులోని షా అనేది పర్షియా పదమని, మరి ఆయన తన పేరు మార్చుకుంటారా? అని కూనంనేని ప్రశ్నించారు. మీ తండ్రి మీకు పెట్టిన పేరుని మారిస్తే ఊరికే ఉంటారా? అంటూ బండి సంజయ్‌ని కూడా నిలదీశారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే.. బీజేపీ పేర్లు మారుస్తోందని అన్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ కేంద్రంలో ఉన్న బీజేపీ అమ్మేస్తోందని.. కరోనా పేరుతో రైల్వే రాయితీలు సైతం తీసేశారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఓ నియంత అని, ఆయన పేదలకు వ్యతిరేకంగా మారారని కూనంనేని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే.. ఈడీలతో దాడులు చేయిస్తున్నారన్నారు.

MLA Gun Fire: డ్యాన్స్ చేస్తూ సడన్‎గా జేబు నుంచి గన్ తీసిన ఎమ్మెల్యే.. షాకైన స్థానికులు

ఎమ్మెల్యేల ఎర కేసు వ్యవహారంలో బీజేపీ కుట్ర భగ్నం కావడం వల్లే.. ఈడీ, సీబీఐ విచారణ తీవ్రత పెంచాయని కూనంనేని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను బెదిరించి, బీజేపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నట్టుగా బీజేపీ చర్యలు ఉన్నాయన్నారు. కేంద్రం అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. మండిపడ్డారు. ఈడీ ఇప్పటిదాకా ఎంతమంది బీజేపీ నాయకులపై దాడులు చేసిందో సమాధానం చెప్పాలన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి పతనం ప్రారంభమైందన్నారు.