Site icon NTV Telugu

Kukatpally : ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్.. వెళ్లి చూస్తే షాక్

Kukatpally

Kukatpally

Kukatpally : హైదరాబాద్‌ కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్‌ (45)ను దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని కలకలానికి గురిచేసింది. గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డీసీపీ బాలానగర్ వివరాల ప్రకారం, హత్యపై జార్ఖండ్‌కు చెందిన హర్ష, అతని స్నేహితుడు రోషన్‌లపై అనుమానం వ్యక్తమవుతోంది. ఘటన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఉదయం రేణు భర్త, కుమారుడు షాపుకు వెళ్లిపోయారు. సాయంత్రం నుండి రేణు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భర్త ఆందోళన చెందారు. రాత్రి ఏడుగంటల సమయంలో ఇంటికి చేరి, వెనక తలుపు ద్వారా కార్మికునితో తలుపులు తెరిపించారు. ఇంట్లోకి వెళ్లినప్పుడు రేణు అగర్వాల్‌ను హాల్‌లో కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి హత్య చేసిన స్థితిలో కనుగొన్నారు. కత్తులు, చాకులతో దాడి చేసి, గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా తలపై రైస్ కుక్కర్‌తో కూడా కొట్టి చంపినట్లు సమాచారం.

Pawan Kalyan: నేడు బాపట్ల జిల్లాలో పవన్‌కల్యాణ్ టూర్ రద్దు.. కారణమిదే..!

నెల రోజుల క్రితం హర్షను జార్ఖండ్ నుంచి సహాయకుడిగా తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. హర్ష, పై అంతస్తుల్లో ఉంటున్న రోషన్‌తో స్నేహం పెంచుకున్నాడు. హత్య జరిగిన రోజే సాయంత్రం ఇద్దరూ కలిసి ఒక బ్యాగ్‌తో బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆధారాలు లభించాయి. ఇంట్లో విలువైన వస్తువులు ఎలాంటి అవి మిస్సయ్యాయో ఇంకా స్పష్టత రాలేదు. ఇంట్లోకి కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించలేదు. ఈ కేసులో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హర్ష, రోషన్‌లను పట్టుకునేందుకు కూకట్పల్లి పోలీసులు గాలిస్తున్నారు.

Midhun Reddy: నేడు రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న ఎంపీ మిథున్‌రెడ్డి

Exit mobile version