అక్కడ పరీక్షలంటే పైసలే.. ఒక్కో విధానానికి ఒక్కో రేటు..
మీరు ఇంటి వద్దనే రాస్తారా…అయితే పదివేలు..
ఒకరికి బదులు మరొక్కరు హాజరౌతారా? అయితే ఐదువేలు
సెల్ ఫోన్ తీసుకెళ్ళి పరీక్ష రాస్తారా అయితే 3 వేలు
కుదరదని సెంటర్ కెళ్ళి చిట్టీలు చూస్తూ పరీక్ష రాస్తారా? అయితే కేవలం 12 వందలే…
ఇదేంటీ లెక్కలు అనుకుంటున్నారా…అవును ఈలెక్కలే ప్రస్తుతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కేయూ దూర విద్యాపరీక్షల్లో చర్చకొస్తున్నాయి…రేట్లు పెట్టి మరీ డబ్బులు వసూల్ చేసి పరీక్షలు రాయిస్తున్నారు..కాసులిచ్చుకో పరీక్ష రాసుకో అనే తరహాలో యవ్వారం సాగిపోతుంది…..కేయూ దూరవిద్య పరిక్షల్లో మాస్ కాపింగ్ కారణం ఏంటీ? వరుసబెట్టి డిబార్లు అవుతున్నా పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకోరా? గుగూల్ పే ద్వారా వసూళ్లు…ఒక్కరికి బదులుగా మరొకరు పరీక్ష రాస్తే కేసు పెట్టకుండా వదిలేస్తారా? ఇంతకీ కేయూ దూరవిద్యా పరీక్షల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న తంతు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న ఎస్ డీఎల్ సీఈ పరీక్షల్లో మాస్ కాపింగ్ జోరుగా జరుగుతుంది..ఉమ్మడి జిల్లాలోని ఆయా పరిక్షా కేంద్రాల్లో పదుల సంఖ్యలో డిబార్లు అవుతున్నారు..కేవలం ఒక్క ఉట్నూర్ లోనే 50 మందికి పైగా డిబార్ అయ్యారు..ఉట్నూర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఉండగా అక్కడ ముగ్గురు నలుగురు బ్రోకర్లు ఒక్కో పరీక్ష పేపర్ కు వెయ్యి నుంచి 15 వందలు వసూల్ చేశారు..అంతేకాదు ఒక్కఏడాది పరీక్ష చూచిరాత రాయిస్తే పది వేలు..సెకండ్ ,ధర్డ్ ఇయర్ బ్యాక్ లాగ్స్ ఉంటే మరో రేటు ఫిక్స్ చేసి వసూళ్లు చేసారు.
ఇంకేంటి యథేచ్ఛగా బుక్స్ ,జిరాక్స్ పేపర్లు పెట్టి రాయించేశారు..అంతటితో ఆగలేదు..ఒక్కరికి బదులుగా మరొక్కరు పరీక్ష రాయించారు..మరో విచిత్రం ఏంటంటే …వదినకు బదులుగా మరిది పరీక్షకు హజరుకాగా కేయూ నుంచి వచ్చిన అధికారులకు చిక్కారు..ఆ ఒక్కరోజే ఉట్నూర్ కేంద్రంలో 31 మంది డిబార్ అయ్యారు..ఇక మరుసటి రోజు సైతం 20మందికి పైగా బుక్స్ పెట్టి రాస్తుండగా పట్టుకున్నారు…ఇవే కాదు పరీక్షహాల్లో 20 మంది ఉన్నా సాయంత్రం వరకు ఆన్సర్ పేపర్లు మాత్రం పుల్ స్టెంత్ వచ్చేశాయి..ఇంట్లో కూర్చోని పరీక్ష రాయించిన సందర్బాలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఒక్కో దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూల్ చేశారు.
Read also:Vishwak Sen: బలుపు తగ్గలేదు.. మరో బూతు పదంతో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్ కా దాస్
ఎవ్వరొస్తారు..సిట్టింగ్ స్వ్కాడ్స్ ను మేనేజ్ చేస్తే అంతే అనుకున్నారో ఏమోకాని ఉట్నూర్ లో గతకొంతకాలంగా మాస్ కాపింగ్ జోరుగా సాగిందనే ఆరోపణలున్నాయి..కేయూ అధికారుల తనిఖీలు చేశాక పరీక్ష కేంద్రాన్ని తొలగించారు..ఇక్కడ పరీక్ష రాసే విద్యార్థులంరినీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష రాసేందుకు అనుమతిచ్చారు..సర్కార్ కళాశాల అని ఎగ్జామ్ సెంటర్ ఇస్తే కాసుల కోసం కక్కుర్తి పడ్డ కేటుగాళ్ల దెబ్బకు ఏకంగా సెంటర్ మార్చేశారు.
ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో జరిగిన పరీక్షల్లో రోజుకో విచిత్రం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉండి పరీక్ష రాయించి సాయంత్రం బుక్ లెట్ ను పరీక్ష కేంద్రానికి తరలించినట్టుగా తేలింది..అక్కడ పరీక్ష నిర్వాహకులకు తోడు స్టడీ సెంటర్ల నిర్వాహకులు బ్రోకర్లను పెట్టి మరీ చూసి రాస్తే ఓరేటు..ఇంట్లో ఉండి రాస్తే మరో రేటు..సెల్ ఫోన్ తీసుకెల్లి రాస్తే ఇంకో రేటు..కాదుకూడదు పరీక్ష హాల్లో చూసి రాస్తే మరో రేటు ఫిక్స్ చేసి దందా సాగించారు….ఇంతటి ఘనకీర్తినిసంపాదించిన సెంటర్ ను తొలగింపు తో ఆపరీక్ష రాసే వాళ్లందరిని జిల్లా కేంద్రంలోని కళాశాలలో పరీక్షరాయాలని చెప్పేశారు. ఆదిలాబాద్ మినహా అన్ని పరీక్ష కేంద్రాల్లో జోరుగా నకలు కొట్టి పరీక్ష రాయించారు..ఏ పరీక్ష కేంద్రానికి వెళ్ళినా చిట్టీల కుప్పలు కనిపిస్తున్నాయి..జిరాక్స్ పేపర్లు పెట్టి రాసిన ఆనవాళ్లున్నాయంటే ఏతరహాలో పరీక్షల నిర్వాహణ కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు సెంటర్ మార్చేశారు..అయితే వారందరిని ఆదిలాబాద్ కేంద్రంలో పరీక్ష కోసం ఆహ్వానిస్తే పేపర్ ఇచ్చి కొద్ది సేపటికే రాయలేం బాబోయ్ అంటూ తిరిగి పేపరిచ్చి వెళ్ళిపోయారు…ఇదేదో పనిగట్టుకుని చెప్పేది కాదు ఆదిలాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చెబుతున్నారు…ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రమోషన్ల కోసం డిగ్రీ ఉండాలని ఎంత చెబితే అంత ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది…ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలలో పరీక్ష సీసీ కెమెరాల నిఘాలో కొనసాగుతుందని ఎలాంటి నకలుకు అవకాశం లేకుండా చేశామన్నారు ప్రిన్సిపల్ . ఉమ్మడి జిల్లాలో కేయూ దూర విద్య పరీక్షల నిర్వాహణపై స్టడీ సెంటర్ల నిర్వాహకులు కాసుల కక్కుర్తి ప్రభావం పడుతోంది..గతంలోనే ప్రైవేట్ పరీక్ష కేంద్రాలను తొలగించగా తాజాగా ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎగ్జామ్ సెంటర్ ను తొలగించారు…బ్రోకర్ల దందా మూలంగా విద్యావ్యవస్థకు చెడ్డపేరొస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Afzal Khan’s Tomb Issue: అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్