KTR Visit to Sirisilla: నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం ఎల్లమ్మ జంక్షన్ అభివృద్ధి & కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.
పాల్గొంటారు. అనంతరం సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో ఇప్పుడు ఈరోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక మధ్యాహ్నం 1.30 గంటలకు వెంకంపేట మెయిన్ రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు కేటీఆర్. మధ్యాహ్నం 2:30 గంటలకు ముస్లిం గ్రేవ్ యార్డ్ అభివృద్ధి పనులకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆఖరి సఫర్ వెహికల్ ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 3:30 గంటలకు మోడల్ అంగన్వాడి కేంద్రం ప్రారంభోత్సవం., సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల పట్టణంలో బస్తీ దవఖాన ప్రారంభించనున్నారు.
నిన్న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో మంత్రి సంభాషించారు. అక్కడున్న విద్యార్థులతో లంచ్ చేసిన ఆయన ఆ తర్వాత వారితో ముచ్చటించారు. ఇక ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అంతేకాకుండా.. విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, విద్యార్థులతో కలిసి మాట్లాడిన తర్వాత ఐటీ ప్రాంగణంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమన్వయంతో ట్రిపుల్ ఐటీని అభివృద్ధి చేస్తామని, త్రిపుల్ ఐటీలో టీ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు, ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మినీ స్టేడియం.. అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు.
NIA Raids: మూడో సారి 25 రాష్ట్రాల్లో NIA సోదాలు.. వామ్మో PFI అకౌంట్ లోకి అన్నికోట్లా..!