NTV Telugu Site icon

BRS KTR: నేడు నాలుగు నియోజకవర్గాల్లో కేటీఆర్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

Ktr

Ktr

BRS KTR: నేడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వేములవాడ, మానకొండూర్‌, కరీంనగర్‌, చొప్పదండి నియోజక వర్గాల్లో కేటీఆర్‌ పర్యటించనున్నారు. కరీంనరగ్‌ పార్టమెంటు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తరుపున ప్రచారం చేయనున్నారు.

Read also: Durga Stotram: ఆదివారం ఈ స్తోత్రం వింటే అభీష్టాలు నెరవేరుతాయి

నాలుగు నియోజవర్గాల్లో షెడ్యూల్‌ ఇదీ..

* వేములవాడ నియోజకవర్గం:
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేములవాడ టౌన్ లోని మహారాజా ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ బూత్ కమిటీ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

* మానకొండూర్ నియోజకవర్గం:
మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూర్ చౌరస్తా వద్ద లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ స్థాయి సమావేశంలో పాల్గొంటారు.

* కరీంనగర్ నియోజకవర్గం:
సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కరీంనగర్ టౌన్ లోని గీతాభవన్ వద్ద పద్మనాయక ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ స్థాయి సమావేశంలో పాల్గొంటారు.

* చొప్పదండి నియోజకవర్గం:
సాయంత్రం 6:30 గంటలకు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో భారీ రోడ్ షోలో పాల్గొంటారు.
Surya Stotram: ఆదివారం సూర్య స్తోత్ర పారాయణం చేస్తే మీ జన్మధన్యం అవుతుంది

Show comments