NTV Telugu Site icon

KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్‌ పర్యటన.. బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరు

Ktr

Ktr

KTR: నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఉదయం 10.30 గంటలకు జరిగే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి యువనేత హాజరవుతారన్నారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, మథోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండగా 2,111 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి ఇద్దరు నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్టీ విజయమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలకు యువనేత దిశానిర్దేశం చేయనున్నారు.

Read also: Vettaiyan : తలైవాకు విలన్ గా రానా దగ్గుబాటి..?

కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జిల్లాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రంలో నాలుగు నెలల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రస్తావించే అవకాశాలున్నాయి. యువనేత పర్యటన సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కులు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ చార్జిలు, మండల, గ్రామస్థాయి నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యటన అనంతరం గులాబీ పార్టీ ప్రచారం జోరందుకోనుంది.

Read also: Postal Jobs: పోస్టాఫీస్ లో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిలాబాద్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మెజారిటీ సాధించింది. ఏడు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు 4,65,476, బీజేపీకి 4,48,967, కాంగ్రెస్‌కు 2,52,281 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు బీజేపీ కంటే 16,509 ఓట్లు ఎక్కువ వచ్చాయి. నిర్మల్, మథోల్ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీని నియమించారు. రెండు నియోజకవర్గాల్లో కొందరు నేతలు పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారు. ఇవాళ ఆదిలాబాద్‌లో జరిగిన కిందిస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగం నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపనుంది.
Lok Sabha Elections 2024: 45 రోజులు.. రూ.4,650 కోట్లు సీజ్‌!