NTV Telugu Site icon

KTR: వెజ్, నాన్ వెజ్ మార్కెట్లపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

Ktr Veg Non Veg

Ktr Veg Non Veg

KTR: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్.. మోదీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతుంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తారు. తాజాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణంపై కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా మార్కెట్లలో సాకాహారంతోపాటు మాంసాహారం కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. మున్సిపల్ శాఖ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఖమ్మం, నారాయణపేట, భువనగిరిలో అందుబాటులోకి వచ్చిన మార్కెట్ల ఫొటోలను షేర్ చేశారు. మార్కెట్ల నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లను కేటీఆర్ ట్విట్టర్‌లో అభినందించారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల అంశంపై చర్చ జరిగింది. 2 లక్షల జనాభాకు కనీసం ఒక మార్కెట్‌ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. శాస్త్రీయ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నామని శాసనసభలో కేసీఆర్ తెలిపారు. నేలపై కూరగాయలు విక్రయిస్తే బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉందన్నారు. మోండా మార్కెట్‌ తరహాలో రాష్ట్రంలోనూ మార్కెట్‌లు నిర్మించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అధునాతన మార్కెట్లను ప్రభుత్వం ప్రారంభించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Bandi Sanjay: కేసీఆర్‌ ఇంకా ఈటల ఆయన మనిషి అనుకుంటున్నారు