Site icon NTV Telugu

KTR Tweet Today: ఆత్మ నిర్భర్ భారత్ చాలా బాగుంది..! ప్రశంసా..? ఎద్దేవా?

Ktr Tweet Today

Ktr Tweet Today

ఆత్మ నిర్భర్ భారత్ చాలా బాగుందని మంత్రి కేటీఆర్‌ ట్విట్‌ చేసారు. అది ప్రశంస నా..? లేదా కేటీఆర్‌ మోడీని ఎద్దేవ చేసారా అంటూ ప్రశ్నించుకుంటున్నారు. అయితే.. తెలంగాణ మంత్రి సోషల్‌ మీడియాలో ఎంతగా యాక్టివ్‌ వుంటారో మనందరికి తెలుసు. ఎవరు ఏ పోస్ట్‌ చేసిన వారికి సమాధానం చెబుతూ.. ప్రతిపక్ష పార్టీలపై ట్విటర్‌ వేదికగా విరుచుకుపడుతుంటారు. వ్యంగాస్ర్తాలు వేస్తుంటారు. ఇవాళ ఆయన కేంద్రం పై చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జాతీయ జెండాలను తయారు చేసుకోవాలని దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆత్మ నిర్భర్ భారత్ చాలా బాగుందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

read also: Kalyan Ram: సంచలన నిర్ణయం.. అదే జరిగితే సినిమాలు మానేస్తా

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ట్విటర్‌ వేదికగా.. ఎన్డీఏ సర్కార్‌ను ఎన్పీఏ సర్కార్‌గా.. ఎన్డీఏ ప్రభుత్వ దార్శనికుడు, విశ్వగురు 75వ స్వాతంత్య్ర వేడుకల గురించి ఏడాది ముందు తెలిసినా, జాతీయ జెండాలను తయారు చేయించలేకపోయారని విమర్శించారు. ఆత్మ నిర్బర్‌ భారత్‌ చాలా బాగుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జాతీయ జెండాల దిగుమతిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమర్థించిన వార్త కథనాన్ని కూడా కేటీఆర్ ట్యాగ్‌ చేస్తూ తన ట్విటర్ ఖాత్‌లో పోస్ట్‌ చేసారు.
Income Tax Returns: ట్యాక్స్ చెల్లింపుదారులకు అలర్ట్.. ఇ-వెరిఫై గడువు 30 రోజులు మాత్రమే

Exit mobile version