NTV Telugu Site icon

KTR: సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది.. కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదు..!

Ktr Revanth Reddy

Ktr Revanth Reddy

KTR: సినిమా స్టార్ట్ కావడం ఎన్నో రోజులు పట్టదు, ఫిబ్రవరి నుండే స్టార్ట్ అవుతుందని.. 5 యేండ్లు పాటు మనం కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నాయకులకు , కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. 10 యేండ్లలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే… కళ్ళు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుందని మండిపడ్డారు. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయింది, కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి సినిమా స్టార్ట్ అవుతుందని అన్నారు. సినిమా స్టార్ట్ కావడం ఎన్నో రోజులు పట్టదు, ఫిబ్రవరి నుండే స్టార్ట్ అవుతుందన్నారు.

Read also: Ishan Kishan: రంజీల్లో ఆడకపోతే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇషాన్‌ కిషన్‌ కష్టమే!

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చెయ్యాలన్నారు. 5 యేండ్లు పాటు మనం కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల పుస్తకంను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగ చదవి అవి అమలు చేసేంత వరకు వదలొద్దని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఒక్క నెల మాసంలోని ప్రజల వ్యతిరేకతను ముటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజమన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంను కాంగ్రెస్ పార్టీ కరపత్రంలా మాట్లాడించారని తెలిపారు. కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయించారని తెలిపారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మాట్లాడుతున్నారని అన్నారు.

Read also: MLA Rachamallu Siva Prasad Reddy: అది కడప జిల్లా పదజాలం.. నా మాటలు ఎస్పీని బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నా..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం పై విచారణ చేసుకోండి స్వాగతిస్తున్నమని అన్నారు. తప్పు తేలితే శిక్ష పడుతుందని అన్నారు. కాళేశ్వరంను పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు ? అని ప్రశ్నించారు. నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ లలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ కు సూచిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విడుదలపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. యాసంగి పంట దిగుబడి తగ్గుతుంది అని అంటున్నారని తెలిపారు. రైతులు పంట పండించుకునే అవకాశం ఇవ్వడం…నీటిని విడుదల చేయండని అన్నారు. మహారాష్ట్ర నుంచి నీటిని తీసుకురావాలన్న కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అనాలోచితం అని తెలిపారు.
Kaushik Reddy: మాణికం ఠాగూర్ పై కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పాం..