NTV Telugu Site icon

KTR: షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుంది.. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Ktr Warangal Tour

Ktr Warangal Tour

KTR: బస్సులు పెడుతాం.. భోజన సౌకర్యం కల్పిస్తాం.. ఎక్కడికైనా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెళ్ళి కరెంట్ వైర్లు పట్టుకోండి.. షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుందని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కనిపించదు..కేసిఆర్ లెక్క సన్నగా ఉంటుంది… షాక్ తో జాడిచ్చి తంతే అడ్రస్ లేకుండా పోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటిఆర్ మాట్లాడారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ప్రతిపక్షాలు వస్తున్నాయని మండిపడ్డారు. కేసిఆర్ ఇచ్చేదానికి ఒకటి రెండు ఎక్కువ ఇస్తామని నాలుగు ఓట్లు డబ్బుల వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగోట్టింది కాంగ్రెస్.. వారికీ సహకరించింది బీజేపీ అన్నారు. తెలంగాణ పై చిత్తశుద్ధితో ఆ రెండు పార్టీలు లేవన్నారు. ప్రధానమంత్రి మోడీ తెలంగాణ పై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాయమాటలతో మోసం చేస్తుందని, కాంగ్రెస్ హాయంలో కరెంట్ కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కరెంట్ పై సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నామని, బస్సులు పెడుతాం భోజన సౌకర్యం కల్పిస్తాం ఎక్కడికైనా కాంగ్రెస్ బిజెపి నాయకులు వెళ్ళి కరెంట్ వైర్లు పట్టుకోండని అన్నారు. షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

కరెంట్ కనిపించదు..కేసిఆర్ లెక్క సన్నగా ఉంటుంది… షాక్ తో జాడిచ్చి తంతే అడ్రస్ లేకుండా పోతారని అన్నారు. ఒకటా రెండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అద్బుతంగా కేసిఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సన్నాసులకు అవి కన్పించడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. ఎలక్షన్ లు రాగానే ఆగం కావద్దన్నారు. పెన్షన్లు పెంచే ఆలోచన కేసిఆర్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ కు గుండు సున్నా ఇచ్చిన మోడీ కి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ అంటుండు.. మోడీ దేవుడిని.. ఎవ్వరికీ దేవుడు.. గ్యాస్ ధర, పెట్రోల్ డిజిల్ ధరలు పెంచినందుకా? అని మండిపడ్డారు. రంగస్థలం సినిమా పాటలా ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా తేల్చుకోవాలన్నారు. ఈ గట్టున స్కీమ్ లు ఉన్నాయి.. ఆ గట్టున స్కామ్ లు ఉన్నాయని అన్నారు. ఈ గట్టున ప్రజాసంక్షేమం ఉంది.. ఆ గట్టున 60 ఏళ్ళు జనాన్ని పీక్కు తిన్నవారు ఉన్నారని మండిపడ్డారు.

వినయ్ భాస్కర్ మాస్ లీడర్.. జనం ఈలలతో పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఇంత మాస్ లీడర్ వినయన్నా అనుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి మూల కేంద్రమయ్యిందన్నారు. ఓరుగల్లు గడ్డ కేసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిందని తెలిపారు. అదే స్పూర్తితో వినయ్ భాస్కర్ ను రికార్డు బద్దలయ్యే మెజారిటీతో గెలిపించాలన్నారు. టాలెంట్ ఎవరు సొత్తు కాదని, ఎన్ఆర్ఐ లు ఎక్కడ ఉన్నా జన్మభూమి లో కంపెనీలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించండని తెలిపారు. Y2k లాంటి సంక్షోభలను ప్రపంచం ఎదుర్కొందన్నారు. భారత జనాభాలో అత్యధిక మానవ వనరులు ఉండడం అతి పెద్ద అసెట్ అన్నారు. భారత్ ప్రపంచాన్ని శాసించే దేశంగా ఎదగాలన్నారు. సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో మానవ వనరులు తప్ప ప్రకృతివనరులు లేవన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులే కాకుండా 8 ఐటి హబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉన్నచోట పని కల్పిస్తున్నామని, హైదరాబాద్ ధీటుగా ఐటి కంపెనీలు నిర్మించడం జరిగిందన్నారు. వరంగల్ పిల్లలు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
CM Jagan : ఏపీ నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద ముప్పుతో పోరాడుతోంది

Show comments