Site icon NTV Telugu

KTR Tweet: రూపాయి విలువ పతనమవుతుంటే.. రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం కేంద్ర ఆర్థిక మంత్రి తపన?

Ktr Tweet

Ktr Tweet

ktr satires on the central government behavior-on twitter రూపాయి విలువ పతనమవుతుంటే..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. డాలర్‌ తో పోలీస్తే రూపాయి విలువ చరిత్రలో అత్యంత కనిష్ఠానికి పడిపోవడంపై కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కేంద్రం పై విమర్శలు గుప్పించారు. రూపాయి విలువ చరిత్రలో అతి తక్కువకు పడిపోయిందని అంటుంటే.. సాదారణంగానే పడిపోయిందని కేంద్ర మంత్రి అంటున్నారని మండిపడ్డారు కేటీఆర్‌. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని అర్థిక అవరోధాలకు ‘యాక్ట్స్‌ ఆఫ్‌ గాడ్‌’ కారణమని, విశ్వగురువును పొగడండి అంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్‌.

అయితే.. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనమైతే, జుమ్లాలు మాత్రం ఎన్నడూ లేనంతగా వృద్ధి చెందాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్ల కారణంగా రూపాయి విలువ పడిపోయిందని జ్ఞానాన్ని బోధిస్తున్న భక్తుల వాదనతో విశ్వగురు మోదీ అంగీకరించబోరని అన్నారు. ఇక.. కేంద్ర ప్రభుత్వ అవినీతి చర్యల కారణంగానే రూపాయి విలువ పతనమైందని, ఐసీయూలో ఉందంటూ గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్‌ వేదికగా ప్రస్తావించారు మంత్రి కేటీఆర్‌.

Exit mobile version