Site icon NTV Telugu

KTR VS Amit Shah: కేసీఆర్ ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్..!

Ktr, Amithsah

Ktr, Amithsah

కేసీఆర్ రైతు వ్యతిరేకి అనడం పైన అమిత్ షా పై కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా కెసిఆర్ గారిని రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఒకవైపు కేసీఆర్ ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధు వంటి కార్యక్రమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పీఎం కిసాన్ గా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఎవరిది అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత, దేశ రైతాంగం యొక్క తీవ్ర వ్యతిరేకత వలన క్షమాపణ చెప్పిన వారెవరని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఫసల్ బీమా యోజన లో చేరలేదని కెసిఆర్ గారిని విమర్శిస్తున్న అమిత్ షా, మరి గుజరాత్ ప్రభుత్వం అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో, అదే పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలన్నారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని రైతంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఈ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చెప్పాలని కేటీఆర్‌ ట్వీట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

నిన్న అమిత్‌ సభలో కేసీఆర్ పై మాట్లాడిన షా.. కేసీఆర్‌ రైతు వ్యతిరేకి అని అన్నారు. రైతులు తెలంగాణలో బాగా నష్టపోతున్నారని, ప్రధాని భీమా పథకం ఇక్కడ అమలు చేయడం లేదని అమిత్ షా అన్నారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనడం లేదన్నారు. తాము ప్రతి రైతు కుటుంబం నుంచి ప్రతి కిలో ధాన్యం సేకరిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఒకవైపు టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా ఒక సంఘటన టీఆర్ఎస్ కి అంది వచ్చిన అవకాశంగా మారింది. హోంమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందివ్వడంపై సోషల్ మీడియాలో దుమారం రెగుతోంది. గుజరాత్ నేతల కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారంటూ టీఆర్ఎస్ పోస్టులు పెట్టింది.. భవిష్యత్తులో అమిత్ షా కాళ్ళ దగ్గర తెలంగాణను తాకట్టుపెడతారనడానికి ఈ సంఘటన ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

Exit mobile version