Site icon NTV Telugu

KTR twitter: మోదీ .. అచ్చేదిన్ ఇవేనా! కేటీఆర్ సెటైర్

Modi

Modi

మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అచ్చే దిన్ అంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇచ్చిన పిలుపున‌కు నేటితో 8 ఏళ్లు పూర్తి అయిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి కేటీఆర్ కాసేప‌టి క్రితం వ్యంగ్యంగా విమ‌ర్శ‌లు చేశారు.

మోదీ అచ్చే దిన్‌కు 8 ఏళ్లు నిండాయ‌న్న కేటీఆర్‌… ఈ 8 ఏళ్లలో మోదీ స‌ర్కారు సాధించిందేమిటి అన్న వాటిని ప్ర‌స్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ సంధించారు. ఈ 8 ఏళ్లలో రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరింద‌న్న కేటీఆర్‌…45 ఏళ్ల‌లో అత్యధిక నిరుద్యోగం దాపురించింద‌ని పేర్కొన్నారు.

ఇక 30 ఏళ్ల గరిష్ఠానికి ద్ర‌వ్యోల్బ‌ణం చేరింద‌ని, ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఎల్పీజీ ధ‌ర‌లు దేశంలోనే ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. 42 ఏళ్ల‌లో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్య‌వస్థ దిగ‌జారింద‌ని పేర్కొన్నారు కేటీఆర్.

02 May 2022 లో.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విమర్శలు గుప్పించే కేటీఆర్.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా మోదీపై ఆయన చేసిన విమర్శలు ఇటు తెలంగాణ.. అటు కేంద్రంలో హాట్ టాపిక్ అయ్యాయి.

మోదీకి విజన్ కొరత..!‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత.. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత.. పరిశ్రమలకు కరెంట్ కొరత.. యువతకు ఉద్యోగాల కొరత.. గ్రామాల్లో ఉపాధి కొరత.. రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. వంటివన్నీ ఉన్నాయన్నారు. అయితే అన్ని సమస్యలకూ మూలం పీఎం మోదీకి విజన్ కొరత కావడమే’ అని కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్‌పై పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు, మోదీ అభిమానులు మాత్రం ఘాటుగా రిప్లయ్ ఇస్తూ కౌంటర్ ఎటాక్‌ చేస్తున్నారు. ఈ ట్వీట్‌పై రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Exit mobile version