Site icon NTV Telugu

KTR: సంపత్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

Ktr

Ktr

KTR: బీఆర్‌ఎస్‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డిని పార్థివదేహానికి ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళులు అర్పించారు.. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సంపత్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. సంపత్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్థికంగా రాజకీయపరంగా పూర్తిగా అండదండలు అందిస్తామని తెలిపారు. చిన్న వయసులోనే పాగాల సంపత్ రెడ్డి మృతి చెందడం నన్ను కలచివేసిందని తెలిపారు.

Read also: Top Headlines@1PM: టాప్‌ న్యూస్‌!

కాగా, సంపత్ రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన సంపత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్‌ఎస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సంపత్ మరణ వార్త తెలియగానే కేటీఆర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య తదితరులు సంపత్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Bihar : రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ట్రాక్టర్‌తో తొక్కించి.. కర్రలతో కొట్టకుని.. యుద్ధాన్ని తలపించారు

Exit mobile version