Site icon NTV Telugu

ఏరో స్పేస్‌ రంగంలో హైదరాబాద్‌ నెం.1 : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ హయాంలో గ్లోబల్‌ సీటీగా అభివృద్ధి చెందడం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఫైటర్‌ ఎయిర్‌ క్రాప్ట్‌ ఎఫ్‌ 21 వింగ్స్‌ తయారీ హైదరాబాద్‌లో చేపట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీలలో హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా ఉండటం హైదరాబాదీలకే కాదు మొత్తం తెలంగాణకే తలమానికమన్నారు కేటీఆర్.

వెయ్యికి పైగా ఏరోస్పేస్‌ కాంపోనెంట్‌ పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు కేటీఆర్. అమెరికా మరియు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ కు సంబంధించి చాలా పరిశ్రమలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ఏరో స్పేస్ రంగంలో నెంబర్ వన్ చేయడానికి కృషిచేసిన టాటా గ్రూప్ కు లాకిడ్ మార్టిన్‌కు కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version