KTR: అప్పు తప్పు అన్నవారే అప్పులు ఎందుకు చేస్తున్నారు.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: అప్పు అనేదే తప్పు అన్నట్లు ప్రచారం చేసిన కాంగ్రెస్ సన్నాసులు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండు ముఖ్యమైన అంశాలు ప్రజల దృష్టికి తీసుకురావాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు. రైతులు కష్టాల కడగండ్లలో ఉన్నారు.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దైనియమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు లు స్తంభించిపోయాయని అన్నారు. పర్యవేక్షించే వ్యవస్థ లేదన్నారు. కామారెడ్డి లో రైతులు రోడ్లు ఎక్కరని తెలిపారు. హమాలీ లా కొరత ఉందన్నారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టాలని సూచించారు. తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక్క దగ్గర కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి అన్నారు. రైతులు ఆందోళనలో ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.
Read also: Sonakshi Sinha: పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా: సోనాక్షి సిన్హా
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఇరువై ఐదు,ముప్పై రోజులుగా ధాన్యం తీసుకు వచ్చిన కొనుగోలు చేయడం లేదన్నారు. తడిసిన దాన్యం,తరుగు లేకుండా FCI ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు.. క్వింటాల్ కి బోనస్.. రుణమాఫీ అయ్యేంత వరకు మేము రైతుల వెంట ఉంటామన్నారు. అవసరం అయితే రైతుల కోసం ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తాం..రోడ్ల మీదకు వస్తామన్నారు. ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ లలో గత 4 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఆ జిల్లాల పట్టభద్రులు గెలిపిస్తారని నమ్ముతున్నామని తెలిపారు. విద్యావంతుడు, ఉత్సాహావంతుడు రాకేష్ రెడ్డి నీ కేసిఆర్ బరిలో నిలిపారన్నారు. ఓటర్లకు మా విజ్ఞప్తి.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు విన్నారు.. ఐదు నెలల పాలన లో ఎలా దగ్హ చేశారో చూశారన్నారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ అన్నారు ఏ మాట నిలబెట్టుకోలేదన్నారు. టెట్ కోసం గతంలో 4వందల ఫీజు ఉంటే.. ఐదు రెట్లు పెంచి రెండు వేలు చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు.. వసతుల కోసం నిబద్ధతతో పని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఐదు నెలలు కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూశారన్నారు. నల్గొండలో ఒక్క మెడికల్ కళాశాల కూడా లేకుండే.. తీసుకువచ్చింది కేసిఆర్ అని గుర్తుచేశారు.
Read also: Health Tips: బరువు తగ్గాలంటే ఈ నీరు రోజూ తాగండి..
సీఎం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఐదు నెలల కాలపరిమితి ముగిసిందన్నారు. మరో ఏడు నెలల కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుక కావాలి అంటే రాజేష్ రెడ్డి నీ గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయులర్.. ఎప్పటికప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదన్నారు. ఆయన్ను గెలిపిస్తే మరో నయీంగా మారుతాడన్నారు. ఒక బ్లాక్మెయిల్ ను గెలిపించాము.. ఆయన పాలన ఎలా ఉందో చూస్తున్నామన్నారు. టీవీ చానెళ్లు అడ్డుపెట్టుకొని బెదిరించే మరో బ్లాక్మెయిల్ ను గెలిపించకూడదన్నారు. చిల్లర రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడన్నారు. కేసిఆర్ సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడిపారన్నారు. రేవంత్ రెడ్డి ముఖం బాగోలేక అద్దం పగలగిట్టుకున్నాట్లు ఉందన్నారు. నిన్న నారాయణ ఖేడ్ లో టీచర్ లా మీద పోలీసులు లాఠీ చార్జి చేస్తున్నారని తెలిపారు. వారు ఎన్నికల్లో పాల్గొన్నందుకు తగిన వేతనం ఇవ్వాలని అడగడం తప్పా? అన్నారు. మూడు లక్షల 89 వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పు అని FRBM చెప్పిందన్నారు. ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రచారం చేసిందన్నారు. అప్పు అనేదే తప్పు అన్నట్లు ప్రచారం చేసిన కాంగ్రెస్ సన్నాసులు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారు.
NTR : షూటింగ్ కు బ్రేక్..బర్త్ డే వేకెషన్ కు ఎన్టీఆర్..
తాజావార్తలు
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!