Site icon NTV Telugu

కేంద్రమంత్రి తోమర్ కు కేటీఆర్ కౌంట‌ర్‌.. అది ఎన్నిక‌ల స్టంటే !

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి న‌రేంద్ర‌ తోమర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బిజెపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మండిప‌డ్డారు కేటీఆర్‌. సాగు చట్టాలను రద్దు చేయడం.. మోడీ క్షమాపణలు చెప్పడం ఎన్నికల స్టంటేన‌ని బీజేపీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సాగు చట్టాలను రద్దు చేశామని మోడీ అంటారని… సాగు చట్టాలు మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రి అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. బిజెపి రాజకీయాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు కేటీఆర్‌.

https://ntvtelugu.com/araku-ycp-mla-chetti-palguna-acting-in-amma-vodi-movie/

కాగా..ఇవాళ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై కేంద్ర వ్య‌వసాయ శాఖ‌ మంత్రి న‌రేంద్ర తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామ‌ని… అయితే.. ఈ సారి సాగు చట్టాలను స్పల్ప మార్పులతో తెస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. వ్య‌వ‌సాయ సాగు చట్టాలపై ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌న్నారు.

Exit mobile version