NTV Telugu Site icon

KTR Counter: పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? కిషన్​రెడ్డికి కేటీఆర్‌ కౌంటర్‌..

Ktr Kishan Reddy

Ktr Kishan Reddy

KTR counter to Kishan Reddy: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కిషన్ రెడ్డి ట్వీట్ చేయగా.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై మంత్రి కేటీఆర్ అదే విధంగా కౌంటర్ ఇచ్చారు. అసలు మ్యాటర్‌లోకి వస్తే.. మిలియన్ మార్చ్ గుర్తు చేస్తూ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. మిలియన్ మార్చ్ కు సుభిక్ష కాలం గడిచిందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనలో కనీస గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో పాటు మిలియన్ మార్చ్ కు బాధ్యులైన నాయకులు, ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు, విమోచన దినోత్సవానికి సరైన గుర్తింపు లభించలేదన్నారు.ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆశయాలను నీరుగార్చేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు.

Read also: 5G Smartphone : 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్న ప్రముఖ కంపెనీ

ఇక కిషన్ రెడ్డి ట్వీట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చి తెలంగాణా పుట్టిందని ఎన్నోసార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పుతో కొట్టుకునే బీజేపీ సన్యాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కావడం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మోదీకి వ్యాక్సిన్ కనిపెట్టమని చెప్పకండి.. పనికొచ్చే పనులు చేయండి’ అని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పండి. తల్లిని చంపి బిడ్డను ఇచ్చానని పదే పదే తెలంగాణా పుట్టుకను అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు దండుకునే బిజెపి సన్యాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కావడం లేదు. మోదీకి వ్యాక్సిన్‌ కనిపెట్టమని చెప్పడం మానేసి.. పని చేసే పనులు చేయండి..’’ అంటూ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు.


Kollywood: అసలు ఊహించని కాంబినేషన్ ఇది…

Show comments