NTV Telugu Site icon

Ktr condolence to joguramanna family: జోగు రామన్నను పరామర్శించిన మంత్రి కేటీఆర్

Ktr Condolence To Joguramanna Family

Ktr Condolence To Joguramanna Family

Ktr condolence to joguramanna family: ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన కుటుంబ సభ్యులను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉదయం మంత్రులు, కేటీఆర్ హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్ లో జైనథ్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా దీపాయిగూడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటికి వెళ్ళి అయన తల్లి జోగు బోజమ్మ చిత్రపటానికి మంత్రులు పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.

Read also: Lakshmi Parvathi: నా పెళ్లి గురించి ఎవరైనా కామెంట్ చేస్తే కేసు పెడతా..!!

అతరువాత ఆదిలాబాద్‌లోని బీజీఎన్చీ డేటా సొల్యూషన్స్‌ సందర్శించి, అక్కడ ఉద్యోగులతో పలు విషయాలపై మాట్లాడనున్నారు. అనంతరం నిర్మల్‌ బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించనున్నారు. త్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. త్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. జూన్‌లో త్రిపుల్‌ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో కలిసారు. సమస్యల పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి త్రిపుల్‌ ఐటీకి వస్తే మంత్రి కేటీఆర్‌ ను తప్పకుండా తీసుకువస్తా అని మాట ఇచ్చారు. దీంతో ఆహామీ మేరకు కేటీఆర్‌ తో కలిసి సబితా ఇంద్రారెడ్డి ఆర్టీయూకేటీకి వెళ్లనున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్‌ రాకతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యార్థులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
Ants: భూమిపై ఉన్న చీమల సంఖ్య ఇదేనట.. ఎంతో తెలిస్తే షాకవుతారు?