NTV Telugu Site icon

KTR: మతం పేరుతో రాజకీయాలు.. విధ్వంసకర శక్తులను ఒక కంట కనిపెట్టండి..!

Ktr

Ktr

మతం పేరుతో రాజకీయాలు చేసే విధ్వంసకర శక్తులను ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్… హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో పర్యటిస్తున్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.. పలు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ ముందుకు పోతామన్నారు. నేను చదువుకునే రోజుల్లో వారానికి రెండుమూడ్రోజులు కర్ఫ్యూ ఉండేదని గుర్తుచేసుకున్న ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు.. హైదరాబాద్‌లో నీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదు.. హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడుకుంటూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

Read Also: Elon Musk: ప్రపంచ కుబేరుడు.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు..

హైదరాబాద్‌లో నోటరీ ప్రాపర్టీ విషయంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.. బహదుర్‌పురాకు జామా ఉస్మానియా వ్యవస్థాపకుడి పేరు పెడతామని ప్రటించిన ఆయన.. పాతబస్తీలో రెండు మూడు నెలలో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని తెలిపారు.. రూ.495 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ ప్రారంభించుకుంటున్నాం.. టీఆర్ఎస్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత మొజంజాహీ మార్కెట్ ను అద్భుతంగా తీర్చిదిద్దామని, సర్ధార్ మహల్‌ను రూ.30 కోట్లతో పునరుద్ధరణ చేకుంటున్నాం.. మిరాలం మండిని రూ.21 కోట్లతో పునర్నిర్మాణం చేయబోతున్నాం.. బహదూర్ పురా ఫ్లై ఓవర్‌ రూ.109 కోట్లతో నిర్మాణం చేసి ప్రారంభించామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.