NTV Telugu Site icon

Krishnam Raju Last Rites: అంతిమయాత్ర రూట్ మ్యాప్.. తరలివస్తోన్న ప్రముఖులు, ఫ్యాన్స్

Krishnamraju Last Rites

Krishnamraju Last Rites

Krishnam Raju Last Rites Route Map: ప్రముఖ సినీ నటుడు, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అకాల మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగింది. కొంతకాలం నుంచి పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధ పడుతున్న ఈయన.. నిన్న తెల్లవారు జామున 3.25 గంటలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఈయన అంతక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు మొయినాబాద్‌ సమీపంలోని కనకమామిడిలో ఉన్న ఫామ్‌ హౌస్‌‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉన్న భౌతికకాయాన్ని.. రోడ్ నెం 45, బిఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా అప్పా జంక్షన్ వద్ద దిగుతుంది. అక్కడి నుంచి మొయినాబాద్ కనకమామిడి‌లోని ఫామ్‌హౌజ్‌కు చేరుకుంటుంది. ప్రభాస్‌ సోదరుడు ప్రబోధ్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు కడసారి చూపుకోసం ఆయన నివాసానికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. విజయనగరం, భీమవరం, మొగల్తూర్, ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు సోలాపూర్ నుంచి తరలి వస్తున్నారు.

మరోవైపు.. కృష్ణంరాజు పార్దీవదేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. కృష్ణంరాజు మరణించారని తెలిసి తాను బాధపడ్డానని.. నటుడుగా, ఎంపీగా, మంత్రిగా ఆయన ప్రజల మన్ననలు అందుకున్నారని అన్నారు. నటి జయప్రద కూడా ఆయన పార్దీవదేహానికి నివాళులర్పించారు. ఎన్నో అధ్బుతమైన పాత్రలు చేసి, ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచారన్నారు. ఆయనతో కలిసి తాను కొన్ని సినిమాల్లో నటించానని.. ఆరోగ్యంగా తిరిగి వస్తారని తాను భావించానని తెలిపారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఎంతో ఎదిగినా.. మచ్చలేని మహారాజుగా, రారాజుగా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాను కోరుకుంటున్నానన్నారు. అంటు.. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ కూడా ష్ణంరాజు ఇంటికి చేరుకున్నారు.