Krishna Express: సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ లో పొగలు వ్యాపించిన ఘటన మరువక ముందే కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వెళుతున్న రైల్ పట్టారు విరిగిపోవటం ఘటన సంచలనంగా మారింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. పట్టాలను పరిశీలించి పట్టాలు విరిగిపోయి మరమ్మతులు చేశారు. అనంతరం రైతుల అక్కడి నుంచి కదిలింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Read also: Rashmika Birthday: నేషనల్ క్రష్ “రష్మిక” ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. బర్త్‌డేకి ఊహించని సర్‌ప్రైజ్..!
సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలుముకున్న ఘటన నిన్న (శనివారం) చోటుచేసుకుంది.అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలును నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. బి4 బోగీలోని బ్యాటరీలో క్యాప్ లీక్ కావడంతో పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే 2 గంటల పాటు రైలు నిలిపి మరమ్మతులు చేపట్టారు. కాగా.. కాజీపేట రైల్వేస్టేషన్ లో నిలిపివేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో కాసేపు ఏమీ అర్థం కాలేదు. అధికారులకు నిలదీయగా రైలులో పొగలు వ్యాపించాయని తెలుపడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని మరమ్మత్తు చేసినట్లు తెలపడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే రైలులో పొగలు వ్యాపించడానికి గల కారణం బ్యాటరీ క్యాప్ లీక్ అవడంతో ఈఘటన తలెత్తిందని రైల్వే సిబ్బంది తెలిపారు. మరమ్మత్తు అనంతరం కాజీపేట నుంచి బయలు దేరింది.
Insta Reel: ఇన్‌స్టా రీల్ కోసం ఫ్లైఓవర్‌పై కారు ఆపాడు.. రూ.36,000 జరిమానా కట్టాడు..