NTV Telugu Site icon

Koti Deepotsavam 4th day Highlights Live: కోటిదీపోత్సవం నాల్గవ రోజు హైలైట్స్

Koti 1

Koti 1

Koti Deepotsavam LIVE | Day 4 Highlights | Vemulawada Rajanna Kalyanam & Yadadri Narasimha Kalyanam

రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 4వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు వేలాదిమంది తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియం భక్త జనసంద్రంగా మారింది. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుండగా.. ఇవాళ నాల్గోరోజు దీపాల ఉత్సవం కోలాహలంగా సాగింది… శ్రీసుబుదేంద్ర తీర్థ స్వామీజీ (శ్రీరాఘవేంద్ర మఠం, మంత్రాలయం) వారిచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మ శ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తిచే ప్రవచానమృతం.. వేదికపై పూజలో భాగంగా నర్మదా బాణ లింగానికి కోటి భస్మాభిషేకం నిర్వహించారు.. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.. ఇక, యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి పరిణయోత్సవం, వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి కల్యాణం వైభవంగా సాగింది.. ఇవాళ వాహనసేవలో భాగంగా అశ్వవాహనం, పల్లకి సేవ నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య నాల్గవ రోజు కోటి దీపోత్సవం నేత్రానందం కలిగించింది.