Koti Deepotsavam 2025 : హైదరాబాద్‌లో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 వేడుకలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. భక్తి టీవీ -ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవం దేశవ్యాప్తంగా విశేషమైన ప్రాధాన్యం సంతరించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడుతూ.. “కోటి దీపోత్సవం కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమవకుండా, భారతదేశం మొత్తం గర్వపడే జాతీయ పండుగగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవాలి” అని అన్నారు. ఈ వేడుక ఎంతో అద్భుతంగా, భక్తి సౌరభంతో కొనసాగుతుందని ప్రశంసిస్తూ, దీనికి జాతీయ గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు వెంటనే పంపిస్తే, కేంద్రం తరఫున గుర్తింపునకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపడతామని తెలిపారు. కోటి దీపోత్సవం భక్తి, ఆధ్యాత్మికత, భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
Chiranjeevi- Ram Charan : చిరుకు కలిసొచ్చింది.. చరణ్ కు ఎదురుదెబ్బ.. రూట్ మార్చారా..?
భక్తి టీవీ కోటి దీపోత్సవం అద్భుతమైన కార్యక్రమం.. భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి : Shri Gajendra Singh Shekhawat #ShriGajendraSinghShekhawat #BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025… pic.twitter.com/75FFPkr6Ks
— BhakthiTV (@BhakthiTVorg) November 7, 2025
