NTV Telugu Site icon

Koppula Eshwar: ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో కేంద్రం చెప్పాలి..?

Koppula Eshwar

Koppula Eshwar

Koppula Eshwar:ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సింగరేణిని ప్రయివేటు పరం చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారని తెలిపారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో సింగరేణిని కాపాడతారని భావించామని తెలిపారు. సింగరేణి ఒక సంస్థ మాత్రమే కాదు ఈ ప్రాంతం కొంగు బంగారం లక్షలాది మందికి ఉపాధినిస్తున్న సంస్థ అన్నారు. కేంద్రం, రాష్ట్రం భాగస్వామ్యంతో సింగరేణి నడుస్తున్నప్పటికి కేసీఆర్ వచ్చాక ఆయన చొరవతో లాభాల్లోకి వచ్చిందని తెలిపారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థ అయిన సింగరేణిని ప్రయివేటు కి ఇవ్వాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిస్సాలో, తమిళనాడు, గుజరాత్ లో ఉన్న బొగ్గుగనులను ఆయా రాష్ట్రాలకు ఇచ్చారన్నారు.

Read also: Raviteja : ఓవర్ చేయకు రోయ్.. నీ దిష్టే తగిలేలా వుంది..

తెలంగాణాలో ఉన్న సింగరేణిని ఎందుకు ప్రయివేట్ వారికి ఇస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని తెలంగాణకు ఇవ్వాలని కోరినా ఎందుకు కేంద్రం ఇవ్వలేదని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ కూడా సింగరేణి కోల్ బ్లాక్ ల వేలాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారన్నారు. సీఎం గా ఉన్న రేవంత్ ఇప్పుడు మోడీ తో కలిసి సింగరేణిని వేలం కుట్ర తెరతీశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేలాన్ని వ్యతిరేకించకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వేలంలో పాల్గొనడం ధ్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు. ఎన్నికలకు ముందు సింగరేణిని ప్రయివేటు పరం చేయము అని మోడీ చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చారన్నారు. బొగ్గు నిల్వలను కనుగొనేందుకు సింగరేణి ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేసింది.. అటువంటి సంస్థను ప్రయివేటు వారికి ఇవ్వడం దారుణమన్నారు. ప్రైవేట్ సంస్థలు వస్తే రిజర్వేషన్లు పోతాయి.. పేదలు, దళితులు హక్కులను కోల్పోయి నష్టపోతారన్నారు.
Pension Amount : పెన్షన్ పంపిణీపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష..