Site icon NTV Telugu

Kunamneni: వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి,బిడ్డ మృతి.. చర్యలు తీసుకోవాలని కూనంనేని కాల్

Kunamneni

Kunamneni

Kunamneni: కొత్తగూడెం ప్రభుత్వ మాత శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయి తల్లి, బిడ్డ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలోని సింధుకి పురిటినొప్పులు రావడంతో మాత శిశు కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంతో సింధు, కడుపులో వున్న నవజాతి శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెపట్టారు. సింధు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. కొత్తగూడెం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలోని చింతాల సింధు కుటుంబ సభ్యులను కూనంనేని పరామర్శించారు. సింధు మృతికి కారకులైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also:Bihar Crisis: ఈరోజు నితీష్ ప్లాన్ ఇదే..!

కొత్తగూడెం ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో జరిగిన సంఘటనను పై స్థాయి అధికారులకు తెలియజేశానని అన్నారు. కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధు అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతికి కారకులైన డాక్టర్లు, సిబ్బందిపై, ఆస్పత్రి సూపరింటెండెంట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు. కాగా.. నిన్న రూ.కోటితో నిర్మించిన జీపీ కార్యాలయాలను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించిన విషయం తెలసిందే.. మండల పరిధిలోని కొత్తసూరారం, మందెరికలపాడు, రంగాపురం కాలనీ, పాతసూరారం, గ్రామాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రూ.20 లక్షలతో నిర్మించారు. ఈ సందర్భంగా పాల్వంచ మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Monkey Man : ఆకట్టుకుంటున్న ‘మంకీ మ్యాన్’ ట్రైలర్..

Exit mobile version