Site icon NTV Telugu

Konda Surekha : ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్త కాదు.. నా జీవితమే ఒక పోరాటం

Konda Surekha

Konda Surekha

Konda Surekha : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు.

“నా కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాల‌ని స్ప‌ష్టం చేసింది.” “నాకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉంది. ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్త కాదు. నా జీవితమే ఒక పోరాటం.” అని ఆమె అన్నారు.

Manam: జపాన్‌లో ‘మనం’ రీ-రిలీజ్

అంతేకాకుండా.. కొండా సురేఖ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. “ఏ కేసులో అయినా గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలని చెప్పడం సర్వసాధారణం. ఇది జరిగి రెండు రోజులు అయింది. అయితే కొంతమంది పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టు సోదరులు ‘కొండా సురేఖ కేసులో సంచలనం’, ‘బిగ్ బ్రేకింగ్’ అంటూ వార్తలు రాస్తున్నారు. వారి ఉత్సాహం చూసి నాకు సంభ్రమాశ్చర్యం కలుగుతోంది.”

“కొండా సురేఖ పేరు అనగానే అంతటి ఉత్సాహమా అన్నట్లు కొంతమంది రిపోర్టర్లు నా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని రాస్తున్నారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.” “చివరగా నేను చెప్పేది ఒకటే, చట్టం తన పని తాను చేసుకుంటుంది.” అని ఆమె అన్నారు.

Rajnath Singh: దమ్ముంటే ఆ ‘‘అణుబాంబు’’ పేల్చు.. రాహుల్ గాంధీకి రాజ్‌నాథ్ సవాల్..

Exit mobile version