NTV Telugu Site icon

Konda Surekha : రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి…

Konda Suresha

Konda Suresha

హనుమకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడానికి రాహుల్ గాంధీ తెలంగాణలోని తుక్కు గూడా కి 6వ తేదీన రావడం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని ఆమె పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లిక్కర్ స్కాం, ఫోన్ ట్రాపింగ్ లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పనులు ఒకొక్కటి బయటపడటం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల లో ఎక్కువ మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య నీ భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు కొండా సురేఖ. జైలు లో కవిత జపమాల కావాలంటుందని ఆయన ఆమె సెటైర్‌ వేశారు.

అనంతరం రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఐనా కూడా ప్రజల కోసం 6 పథకాలు ప్రవేశ పెట్టినమన్నారు. 6వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద మొత్తంలో వచ్చి సభను విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నానన్నారు.