Komatireddy Venkat Reddy: కేంద్ర రైల్వేశాక మంత్రి అశ్విని వైష్ణవ్ తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై గురించి చర్చించారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి స్టేషన్ కు ప్రతీరోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారని, అదే విధంగా జనగామ జిల్లాగా ఏర్పడిందని, రోజూ విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారని ఈ రెండు స్టేషన్లను ఆధునీకీకరించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు.
Read Also: Dc Vs Kkr : చెలరేగిపోతున్న ఢిల్లీ బౌలర్లు.. వరుస వికెట్లు కోల్పోతున్న కేకేఆర్
ఎంఎంటీఎస్ సేవల్ని ఘట్కేసర్ వరకు పొడగించాల్సిన అవరసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంఎంటీఎస్ రెండోదశకు 2/3 వంతున పనలు చేపట్టాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం చేస్తుండటం వల్ల పనులు కార్యరూపం దాల్చలేదని కేంద్ర మంత్రికి తెలియజేశారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకుండా వెంటనే పనులు చేపట్టానలి కోరారు.
కోమటి రెడ్డి చేసిన అభ్యర్థనపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. కేంద్రమే మొత్తం ఖర్చును భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి, జనగామ రైల్వే స్టేషన్లను కూడా డెవలప్ చేస్తామని హమీ ఇచ్చారు.
