Site icon NTV Telugu

Komatireddy Venkatreddy: కాంగ్రెస్‌కి పూర్వవైభవం తెస్తా

Mp Komati

Mp Komati

తెలంగాణ కాంగ్రెస్ కి జవజీవాలు తెచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమించింది. దీంతో ఆయన వర్గం ఖుషీగా వుంది. శ్రీరామనవమి సందర్భంగా రామగిరిలో సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఏఐసీసీ తనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. కేసీఆర్ చేస్తున్న మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు భూమి ఇస్తే కేసీఆర్ ఆ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ కి ధారాదత్తం చేస్తున్నాడని కోమటిరెడ్డి మండిపడ్డారు.

నీళ్లు ,నిధులు,నియామకాల కోసం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ ను అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను ఎలా నాశనం చేస్తున్నాడో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తానన్నారు. శక్తి వంచన లేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకు రావటానికి కృషి చేస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Exit mobile version