NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: ఈనెల 15న ఆస్ట్రేలియా పర్యటన.. మరి మునుగోడు ప్రచారం సంగతేంటి?

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. ప్రధానపార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా.. తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో రకాలు ప్రణాళికలను వేస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన విషయం తెలిసిందే… ఈనేపథ్యంలో.. కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఆపార్టీకి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. మునుగోడులో ప్రచారం చేస్తారా? లేదా? అనేది ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కారణం బీజేపీ నుంచి బరిలో నిలుస్తున్నది తన సోదరుడే అంటూ విశ్వనీయ సమాచారం.

Read also: Dwaraka Tirumala Kalyanam: చిన్నతిరుపతిలో అంగరంగవైభవంగా స్వామివారి కళ్యాణం

అయితే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ తరుపున బరిలో వుండి ప్రచారంలో పాల్గొంటే మరి తన సోదరుడికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ తరుపున ప్రచారం చేయాలి. ఈనేపథ్యంలో మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారం ఓరేంజ్‌ లో పోటాపోటీ ప్రచారాలు జరుగుతాయని ఆశించిన వారందరికి నిరాశే ఎదురైందని చెప్పాలి. మునుగోడు ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే.. గతనెలలో మునుగోడులో ప్రచారానికి తాను సిద్ధమని ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ కు మద్దతుగా ఇఫ్పటివరకు ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేదు… ఎక్కడా మాట్లాడటం లేదు! కానీ, ముఖ్యనాయకులు మాత్రం వెంకటరెడ్డి ప్రచారం నిర్వహిస్తారని సభల్లో ప్రస్తావించారు…అయితే మునుగోడులో పాల్వాయి స్రవంతి కూడా తనకు మద్దతుగా ప్రచారం చేయాలని కోరడంతో.. వెంకటరెడ్డి ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చినట్లుగా స్రవంతి తెలిపారు. వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటారా అనే ఊహాగానాలకు అనుమానం వద్దని పార్టీవిజయం కోసం వెంకటరెడ్డి పనిచేస్తారని సీఎల్పీ భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

అయితే ఇదంతా సరే ఈనెల 15వ తేదీని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దాదాపు 20 రోజుల పాటు ఆయన కుటుంబంతో అక్కడే ఉంటారు. మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం పార్టీకి కలిసి వస్తుందని అంతా భావించారు… కానీ, ఆయన ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. పార్టీ ముఖ్య నేతలు ఆయన మనస్సు మారుస్తారో లేదో వేచి చూడాలి.
National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం