Komatireddy Venkat Reddy: ఈనెల 15న ఆస్ట్రేలియా పర్యటన.. మరి మునుగోడు ప్రచారం సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. ప్రధానపార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా.. తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో రకాలు ప్రణాళికలను వేస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన విషయం తెలిసిందే… ఈనేపథ్యంలో.. కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఆపార్టీకి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. మునుగోడులో ప్రచారం చేస్తారా? లేదా? అనేది ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కారణం బీజేపీ నుంచి బరిలో నిలుస్తున్నది తన సోదరుడే అంటూ విశ్వనీయ సమాచారం.
Read also: Dwaraka Tirumala Kalyanam: చిన్నతిరుపతిలో అంగరంగవైభవంగా స్వామివారి కళ్యాణం
Also Read
- Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
అయితే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరుపున బరిలో వుండి ప్రచారంలో పాల్గొంటే మరి తన సోదరుడికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయాలి. ఈనేపథ్యంలో మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం ఓరేంజ్ లో పోటాపోటీ ప్రచారాలు జరుగుతాయని ఆశించిన వారందరికి నిరాశే ఎదురైందని చెప్పాలి. మునుగోడు ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే.. గతనెలలో మునుగోడులో ప్రచారానికి తాను సిద్ధమని ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ కు మద్దతుగా ఇఫ్పటివరకు ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేదు… ఎక్కడా మాట్లాడటం లేదు! కానీ, ముఖ్యనాయకులు మాత్రం వెంకటరెడ్డి ప్రచారం నిర్వహిస్తారని సభల్లో ప్రస్తావించారు…అయితే మునుగోడులో పాల్వాయి స్రవంతి కూడా తనకు మద్దతుగా ప్రచారం చేయాలని కోరడంతో.. వెంకటరెడ్డి ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చినట్లుగా స్రవంతి తెలిపారు. వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటారా అనే ఊహాగానాలకు అనుమానం వద్దని పార్టీవిజయం కోసం వెంకటరెడ్డి పనిచేస్తారని సీఎల్పీ భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
అయితే ఇదంతా సరే ఈనెల 15వ తేదీని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దాదాపు 20 రోజుల పాటు ఆయన కుటుంబంతో అక్కడే ఉంటారు. మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం పార్టీకి కలిసి వస్తుందని అంతా భావించారు… కానీ, ఆయన ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. పార్టీ ముఖ్య నేతలు ఆయన మనస్సు మారుస్తారో లేదో వేచి చూడాలి.
National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!