NTV Telugu Site icon

Nalgonda MP Ticket: నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీలో కోమటిరెడ్డి కూతురు శ్రీనిధి?

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Nalgonda MP Ticket: నల్గొండ ఎంపీ సీటుపై కాంగ్రెస్ నాయకులు కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఊపు కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నల్గొండ ఎంపీ సీటుకు ఇప్పటికే నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘు వీర్ దరఖాస్తు చేసుకోగా.. తాజాగా భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి పవన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈరోజు నల్గొండ ఎంపీ సీటు నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి బరిలో ఉండే ఛాన్స్‌ ఉందని సమాచారం.

Read also: IAS Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు.. హెచ్‌‌జీఎల్ ఎండీగా..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. నల్గొండ నుంచి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అధిష్టానం కూడా కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతల చూపు నల్గొండ ఎంపీ సీటుపై పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి కూతురు శ్రీనిధి పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి కుటుంబం నుంచి భువనగిరి టికెట్ కోసం పవన్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. జానా రెడ్డి తనయుడు రఘువీర్ కూడా నల్గొండ సీటుకు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు… ఎంపీ సీటు ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని పటేల్ రమేష్ రెడ్డి చెబుతున్నారు. పటేల్ రమేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. మరి ఎంపీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
Ramachandra Reddy: ఎన్నికల సమయంలో ఇదంతా సహజమే.. వేమిరెడ్డి అసంతృప్తిపై పెద్దిరెడ్డి!