NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: బడ్జెట్ లో 13శాతం అప్పుల చెల్లింపులకే పోతుంది

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: గత ప్రభుత్వం అప్పులను మిగిల్చి వెళ్తే… బడ్జెట్ లో 13శాతం అప్పుల చెల్లింపులకే పోతుందని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ డివిజన్ లో ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్ ను ప్రారంభించారు. అనంతరం సనత్ నగర్ నియోజక వర్గంలో ఆయన పర్యటనలో మాట్లాడుతూ.. బడ్జెట్ లో సంక్షేమం, విద్యా, వైద్యం కు పెద్దపీట వేసామన్నారు. గత ప్రభుత్వం అంకెల, మాటల గారడితో కాలం వెల్లదీసిందన్నారు. రెగ్యులర్ బడ్జెట్ చాలా గొప్పగా ఉంటుందన్నారు. RRR సూపర్ గేమ్ చేంజ్ గా… తెలంగాణాకు తలమానికంగా మారబోతుందన్నారు. మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ వల్లే RRR ఆలస్యం అయ్యిందన్నారు. SLBC ఎన్నికల అస్త్రం గానే చూసారు కేసీఆర్ అన్నారు. SLBC నీ నిర్లక్ష్యం చేసి, నల్లగొండ జిల్లాను ఎండబెట్టుంది కేసీఆర్ అని మండిపడ్డారు.

Read also: Pakistan Elections: పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్, రీపోలింగ్‌కి ఆదేశం.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా ఆందోళనలు..

జగన్ తో కుమ్మక్కై కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసారన్నారు. KRMB గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీష్ రావు కు లేదున్నారు. స్కూల్స్ లో సదుపయలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమలు ప్రారంభించారు. బిఆర్ఎస్ నేతల చెప్పు చేతల్లో వుంటూ భయపడి పనులు ఆపవద్దని అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యా రంగానికి అంతగా కేటాయించలేదన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకుండా నిధులు మళ్ళించిందన్నారు. ఈ ప్రభుత్వంలో విద్యారంగానికి అంతగా బడ్జెట్ కేటాయించలేదన్నారు.
Pushpa 3: రైజ్… రూల్ కాదు… ఇకపై “రోర్”