NTV Telugu Site icon

Komatireddy: మోడీ ..అచ్చేదిన్ తెస్తా అనే పేరుతో ప్రధాని అయ్యారు..

Koamti Reddy Venkat Reddy

Koamti Reddy Venkat Reddy

Komatireddy: మోడీ ..అచ్చేదిన్ తెస్తా అనే పేరుతో ప్రధాని అయ్యారని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు కీలక ఎన్నికలన్నారు. మోడీ ..అచ్చె దిన్ తెస్తా అనే పేరుతో ప్రధాని అయ్యారని మండిపడ్డారు. బ్లాక్ మని తేలేదు.. రూ.15 లక్షలు దేవుడు ఎరుగు.. 15 పైసలు కూడా జన్ ధన్ ఖాతాలో పడలేదన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉండి.. రాముడు పేరుతో ఓట్లు అడిగే పరిస్థితికి మోడీ వచ్చాడన్నారు. మతాల అంశం చర్చకు వచ్చింది అంటే మోడీ ఓటమి అక్కడే బయటపడిందని అన్నారు. రూ.400 సిలిండర్ ను రూ. 1200 అయ్యింది.. దాని గురించి మాట్లాడరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూడాయిల్ ధర తగ్గింది.. కానీ పెట్రో ధరలు పెరిగాయన్నారు.

Read also: PM Modi: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌.. హైదరాబాద్‌ని ఎంఐఎంకి రాసిచ్చింది..

ఎన్డీఏ కూటమే మా టార్గెట్ అన్నారు. ఒక మతాన్ని టార్గెట్ చేస్తే… జరగరానిది జరిగితే.. మిలటరీ కూడా ఆపలేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మోడీ, అమిత్ షా లు మట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందువుల ఓట్లు వస్తాయని.. మైనార్టీలను టార్గెట్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ మూడో సారి ప్రధాని అయితే.. 2029 లో ఎన్నికలు ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-చైనా లాగా మారిపోతుందన్నారు. రైతులను బార్డర్ లో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర అడిగితే ఇవ్వడం లేదన్నారు. మళ్ళీ మోడీ ప్రధాని అయితే.. రాజుల పాలన వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా టార్గెట్ 15 సీట్లు..14 గెలుస్తామన్నారు.

Read also: PM Modi: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న ప్రధాని.. సభలో మోడీ ప్రసంగం..

కేసీఆర్ కి ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదన్నారు. కేసీఆర్ గురించి చెప్పాలంటే రామాయణం అంత ఉంటదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు. సచ్చిన పాము కేసీఆర్ అన్నారు. దళితుడు తొలి సీఎం..లేదంటే తలనరుక్కుంటా అన్నాడు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మాటలు దేశంలో ఎవరు అనలేదన్నారు. దళితులను మోసం చేసిన కేసీఆర్.. కాళేశ్వరం నుండి లిక్కర్ వరకు అవినీతే అన్నారు. కేసీఆర్ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరి మీద 5వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. టానిక్ పేరుతో..ఒక్క అనుమతితో పదుల షాపులు నడిపాడన్నారు.

Read also: Komatireddy: మోడీ ..అచ్చేదిన్ తెస్తా అనే పేరుతో ప్రధాని అయ్యారు..

కేసీఆర్ బాషా మారడం లేదు..ఆ బాషా ఆయాన నేర్పిండే అన్నారు. 48 గంటలు కాదు..ఆయన్ని ప్రచారం చేయకుండా నిషేదించాలని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన దీక్ష దొంగ దీక్ష చేశారని మండపడ్డారు. ఇంజెక్షన్ లు తీసుకుని దీక్ష చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డాక్యుమెంట్ లు కూడా ఇస్తున్న అన్నారు. హరీష్ రావు.. డ్రామా రావు.. రాజీనామా రెండు పేజీలు రాసుకుని వచ్చాడని తెలిపారు. సింగిల్ లైన్ లో ఉంటే.. రాజీనామా లేఖ అన్నారు. కేసీఆర్ వెస్ట్ ఫెలో.. అలాంటి వెస్ట్ ఫెల్లో గురించి మాట్లాడటం టైం వెస్టు అంటూ మండిపడ్డారు.
Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి.. భువనగిరి సభలో అమిత్ షా ప్రసంగం