NTV Telugu Site icon

Komatireddy: కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండబెట్టాడు.. కేటీఆర్ కు కోమటిరెడ్డి సెటైర్

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండబెట్టాడని ఎమ్మెల్యే కేటీఆర్ కు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్ వేశారు. యాదాద్రి జిల్లా పర్యటించిన ఆయన కేటీఆర్ మాటలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలు గోటికి సరిపోవడని అంటావా? అంటూ మండిపడ్డారు. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండపెట్టాడని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మూడవరోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు.. మీరెప్పుడైనా మాట్లాడారా? ప్రశ్నించారు. కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే, మిమ్మల్ని తొక్కితే 50 వేల ఓట్లతో ఒక్కొక్కరు ఓడిపోయారు అది గుర్తు పెట్టుకో అంటూ మండిపడ్డారు. జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి.. అంచలంచలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. కొండమాడుగు లో కాలుష్య పరిశ్రమలు తీసివేసి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.

Read also: Kota: “మమ్మీ, డాడీ, ఈ జేఈఈ నావల్ల కాదు”.. కోటాలో మరో ఆత్మహత్య..

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్‌ మహాసభలో రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ కాలిగోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం సీటు కొన్నారని ఎద్దేవ చేశారు. అమలుకానీ వాగ్ధానంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం చేతకావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానివల్లే కేసీఆర్ అప్పులు చేశాడంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో 1.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి అధికారం కోల్పోయామన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కారుకు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, మళ్లీ వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి మృతి.. సంతాపం తెలిపిన సీఎం