Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిస్తే.. నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ పార్లమెంటు స్థానాన్ని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్నారు. వందరోజుల పాలనలో చేసిన అభివృద్ధితో ఈ మెజారిటీ వస్తుందన్నారు. తెలంగాణను అన్ని రంగాలలో విధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. నల్లగొండలో ఫ్లోరైడ్ తరిమేశానని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ 14 సీట్లకు పైగా గెల్చుకుంటుందన్నారు. బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా రాకపోవచ్చన్నారు.
Read also: Lok Sabha Election 2024: మెదక్, జహీరాబాద్ లోక్ సభ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్
కేసీఆర్ చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యధిక మెజారిటీ కోసమే నల్లగొండలో మా ప్రచారం అన్నారు. ఇద్దరు కలిసి నీళ్లు దోచుకోవడానికి జగన్ తో కేసీఆర్ దోస్తీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. చావు తప్పి కన్ను లోట్టపోయి జిల్లాలో ఒక్క స్థానం గెలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిస్తే.. నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సంచనల వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశ లేదు..
రేవంత్ రెడ్డే సీఎంగా అంటారన్నారు.
Read also: AP-TS Nominations: తెలుగు రాష్ట్రాల్లో రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
నలగొండ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు నల్లగొండ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా దక్కదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్రానికి, జిల్లాకు ఏమీ చేయలేదు.. వాళ్లకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదన్నారు. పార్లెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చే సీట్ల సంఖ్య సున్నా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు.
CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన హరీష్ రావు